3వ క్రెడాయి వరంగల్ ప్రాపర్టీ షోను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌

: నగరంలోని వడ్డేపల్లి పీజీ ఆర్ గార్డెన్స్ లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న “క్రెడాయి ప్రపోర్టీ షో ను శనివారం  తెలంగాణ రాష్ట్ర రోడ్డు, రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు నాయిని రాజేందర్ రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, నగర మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1999 ఢిల్లీలో ప్రారంభమైన క్రెడాయి సంస్థ అంచలంచెలుగా ఎదుగుతూ దేశ వ్యాప్తంగా రావడం గొప్ప పరిణామం. అభివృద్ధి పరమైన కార్యక్రమాలతో పాటుగా సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం పట్ల మంత్రి అభినందించారు.

సగటు మధ్య తరగతి కుటుంబానికి అనుగుణమైన కలలసౌథానికి క్రెడాయి సంస్థ ఒక అద్భుత వేదిక అని అన్నారు. ఈ సంస్థలో గృహ నిర్మాణంతో పాటు గృహోపకరణాలు కూడా అందుబాటులో ఉండటం చాలా గొప్ప విశేషం అని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు వారికి అనుగుణమైన అవకాశాలు కలుగుతాయని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో అన్ని రంగాల అభివృద్ధికి సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. హైదరాబాద్ తరువాత అతిపెద్ద రెండో పెద్ద నగరం వరంగల్, హనుమకొండ, ఖాజిపేట త్రినగరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రెడాయి సంస్థ వరంగల్ జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి, ఉపాధ్యక్షులు

రవీందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రేమ్ సాగర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మురళి కృష్ణ రెడ్డి, నేషనల్ ఈసీ మెంబర్ రామచంద్రారెడ్డి, క్రెడాయి వరంగల్ సంస్థ ఉపాధ్యక్షులు ఎన్.అమరేందర్ రెడ్డి, ఎస్.అమర్ లింగేశ్వర్ రావు, ఎం.రవీందర్ రెడ్డి, సాధారణ కార్యదర్శి జె.మనోహర్, సంయుక్త కార్యదర్శి ఎల్. రజినీకాంత్ రెడ్డి, ఎం.రాజ్ కుమార్, జి. రాజేందర్ రెడ్డి కోశాధికారి ఎ.వెంకట మల్లా రెడ్డి, ఆర్గనైజేషన్ సెక్రటరీ వరుణ్ కుమార్ అగర్వాల్, యూత్ వింగ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *