స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం- రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 68 మంది మృతి
.స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌కు దక్షిణంగా ఉన్న ఉర్దా సమీపంలో రెండు హై-స్పీడ్ రైళ్లు ఢీకొన్న ఘటనలో 68 మంది మరణించారు.
ఈ మరణాలను కాస్టిల్లా-లా మాంచా ప్రాంతీయ ప్రభుత్వం ధృవీకరించింది. ఈ రెండు రైళ్లలో 500 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. సహాయ చర్యలు కొనసాగుతుండగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రమాదం తర్వాత బయటకు వచ్చిన వీడియో ఫుటేజ్‌ను బీబీసీ వెరిఫై విశ్లేషించింది. రైలు బోగీలు పట్టాలు తప్పి, బోల్తా పడి ఉండటం ఈ వీడియోలలో కనిపించింది.